'గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి'

'గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి'

MBNR: మహమ్మదాబాద్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాయకుడు కురువ కృష్ణ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో గోవును గోమాతగా పూజిస్తారని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఆవు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనంతరం ఈ డిమాండ్పై ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు.