VIDEO: గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం
అన్నమయ్య: కురబలకోట మండలం ఎర్రజేండ్లు, అడవిగుంతల గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం గ్రామాల మధ్య గొడవలు, పైపుల ధ్వంసం వంటి సంఘటనలతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయంపై మీడియాలో వార్తలు రావడంతో MPDO గంగయ్య స్పందించారు. రూ.5 లక్షల వ్యయంతో బోరు బావిని ఏర్పాటు చేసి, గ్రామాలకు తాగునీటిని అందించారు. దీంతో గ్రామస్తులు శనివారం ఉపశమనం పొందారు.