'గిట్టుబాటు ధర కల్పించడంలో చొరవ చూపాలి'

'గిట్టుబాటు ధర కల్పించడంలో చొరవ చూపాలి'

RR: మార్కెట్ కమిటీలు రైతుల సంక్షేమం కోసం పని చేయాలని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. బాటసింగారం పండ్ల మార్కెట్‌ను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ పనితీరును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తీసుకొచ్చిన సరుకుకు గిట్టుబాటు ధర కల్పించడంలో చొరవ చూపాలన్నారు.