కోట్ల ఆస్తి.. కళ్యాణానికి నోచుకోని శ్రీరాముడు
KDP: మైదుకూరు(మం) వనిపెంట గ్రామంలో రూ.కోట్ల విలువైన ఆస్తులు ఉన్నా రామాలయంలో శ్రీరామ నవమి రోజు ప్రత్యేక పూజలు, కళ్యాణానికి కూడా నోచుకోలేదు. సంవత్సరానికి రూ. లక్ష వస్తున్నా ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యంతో హిందువుల ప్రధాన పండగ అయిన శ్రీరామ నవమిపండగ రోజున రామాలయాన్ని తెరవకపోవడం, పూజలు లేకపోవడం బాధాకరమని భక్తులు వాపోతున్నారు.