అల్లూరి సీతారామరాజుకి నివాళులర్పించిన ఎస్పీ

SKLM: అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి పురస్కరించుకొని బుధవారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర ఉద్యమంలో చేసిన పోరాట స్ఫూర్తిని మనమందరం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.