ఆంజనేయస్వామి వార్షికోత్సవంలో పాల్గొన్న హరీశ్ రావు

సిద్దిపేట పట్టణంలోని ప్రశాంత్ నగర్ శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం వార్షికోత్సవంలో బుధవారం ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావును ఆలయ నిర్వాహకులు శాలువా కప్పి సత్కరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి అర్చకులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి తనవంతు సహకారం ఉంటుందని అన్నారు.