ఆలయంలో సౌకర్యాలు కరువు

SRD: ఝరాసంగం సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం గతంలో ఏర్పాటు చేసిన షవర్లు అధికారుల నిర్వహణ లోపంతో అవి పని చేయక అస్తవ్యస్తంగా మారాయి. ఆలయ ఆవరణలోని వాగు పక్కన భక్తుల స్నానాల కోసం ఏర్పాటు చేసిన షవర్లపై భక్తులు బట్టలు ఆరేసిన దృశ్యం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. ఆలయ నిర్వహణపై సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.