జిల్లాలో EV చార్జింగ్ స్టేషన్‌లు లేక ఇబ్బందులు
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్నా, ఛార్జింగ్ స్టేషన్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ప్రస్తుతం జిల్లాలో కేవలం 12 స్టేషన్లు మాత్రమే ఉండగా, ప్రతి 30 కి.మీ.కి ఒక స్టేషన్ అవసరమని నిపుణులు అంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 3,468కు చేరుకున్నా సౌకర్యాలు తగినంతగా లేవు. అనుమతులు ఇచ్చినా పనులు ప్రారంభం కావడం లేదు.