‘రూ.1000 కోట్లతో గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేయాలి’
JGL: గల్ఫ్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక బడ్జెట్ అవసరమని, రూ.1000 కోట్లతో గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ అన్నారు. మెట్పల్లి మండలం వెల్లుల్లకు చెందిన ఆయన దుబాయ్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.1800 కోట్ల ఆదాయం గల్ఫ్ కార్మికుల ద్వారా వస్తుందన్నారు.