కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎంపీ

NDL: ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి వీరేంద్ర కుమార్‌ను బుధవారం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని బెడ బుడగ జంగం కమ్యూనిటీని షెడ్యూల్డ్ కాస్ట్ జాబితాలో చేర్చే ప్రతిపాదనపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.