'ఎంపీ తక్షణమే రాజీనామా చేయాలి'
VSP: భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ శ్రీ భరత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ జీవీఎంసీ ప్రధాన ద్వారం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు.