నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
MHBD: గూడూరు మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణ మరమ్మత్తుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. గూడూరు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు.