విద్యుదాఘాతంతో ఆవు మృతి

విద్యుదాఘాతంతో ఆవు మృతి

NRPT: విద్యుదాఘాతానికి గురై ఆవు మృతి చెందిన ఘటన ఊట్కూరు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎస్.అనిల్ రోజు మాదిరిగానే అవును మేతకు వదిలాడు. ఈ క్రమంలో ఎల్లమ్మ గుడి వద్ద ఎలాంటి కంచెలేని ట్రాన్స్ ఫార్మర్ సమీపంలో మేత మేస్తుండగా తీగలకు తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఈ చూడి పాడి ఆవు విలువ రూ. 60 వేలు ఉంటుందని అనిల్ అన్నాడు.