నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో నేడు (మంగళవారం) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ అంజల్ కుమార్ ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ ఉండదని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.