ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
KRNL: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బళ్లారి చౌరస్తా సమీపంలో రోడ్డు దాటుతున్న ముగ్గురు పాదచారులను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.