VIDEO: రైతు బజార్‌లో క్లీనింగ్ కష్టాలు
SDPT: సిద్దిపేటలోని రైతు బజార్లో తరచూ క్లీనింగ్ పనులు చేపట్టడంపై రైతులు మండిపడుతున్నారు. 20 రోజుల వ్యవధిలోనే రెండుసార్లు (గత నెల 13న, మళ్లీ నేడు) శుభ్రం చేయడంతో వ్యాపారానికి ఆటంకం కలుగుతోందని వాపోతున్నారు. బజార్ లోపల పనుల వల్ల రైతులు రోడ్డుపైనే కూరగాయలు విక్రయించాల్సి రావడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోతోందని అన్నారు. సెలవు దినాల్లో ఇలాంటి పనులు చేపట్టాలన్నారు.