శ్యామలానగర్ రైల్వే గేటుకు ROB ఆమోదం

శ్యామలానగర్ రైల్వే గేటుకు ROB ఆమోదం

గుంటూరు శ్యామలానగర్ రైల్వే గేటు (నం.312) వద్ద ట్రాఫిక్ సమస్యలు త్వరలో తగ్గనున్నాయి. రైళ్ల రాకపోకలు పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో డబుల్ లైన్ ROBకి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుకు రూ.78.46 కోట్లు కేటాయించగా, డీపీఆర్ కోసం రూ.9.52 కోట్లు విడుదల చేశారు. భూసేకరణ పూర్తయ్యాక నిర్మాణం ప్రారంభం కానుంది.