VIDEO: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం సీజ్
GNTR: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అరండల్ పేట 4వ లైన్ ప్రాంతంలో జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులను, వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. అపంతరం అరండల్‌పేట పోలీసులకు అప్పగించారు.