మహిళను కాపాడిన మాచవరం పోలీసులు

NTR: విజయవాడలోని గుణదలకు చెందిన ఓ మహిళ కుటుంబకలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భర్తకు ఫోన్‌లో తెలిపి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త శివకృష్ణ మాచవరం పోలీసులకు బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన సీఐ ప్రకాష్ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేయగా.. ప్రకాశం బ్యారేజ్ వద్ద సదరు మహిళ ఉన్నట్లు గుర్తించి మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు.