VIDEO: 'సరిపడా టోకెన్లు ఇవ్వడం లేదు'

MHBD: నర్సింహులపేట మండల కేంద్రంలో మంగళవారం 500 మంది రైతులు యూరియా కోసం క్యూలో నిల్చోగా, కేవలం 50 మందికి మాత్రమే టోకెన్లు ఇవ్వడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తెల్లవారుజాము నుంచి వేచి ఉన్నా సరిపడా టోకెన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సర్దిచెప్పినా, రోజూ ఇదే పరిస్థితని రైతులు ఆరోపించారు.