సేంద్రియ పంటను పరిశీలించిన ఎమ్మెల్యే
VZM: నెల్లిమర్లలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తన సొంత తోటలో సేంద్రియ పద్దతిలో పండిస్తున్న మామిడి తోటను ఇవాళ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చీడపీడల నుంచి రక్షణ కల్పించేందుకు, ప్రతి కాయకు అత్యంత నేర్పుతో 'సేఫ్టీ కవర్లను' తొడిగారు. రసాయన మందుల వాడకాన్ని తగ్గిస్తూ, పర్యావరణహితమైన పద్ధతులను పాటించడంలో ఆమె నియోజకవర్గ రైతాంగానికి సరికొత్త దిశానిర్దేశం చేశారు.