VIDEO: వచ్చే నెల నుంచి బెల్టు దుకాణాలు బంద్
KMR: మద్నూర్‌లో వచ్చే నెల 5 నుంచి బెల్టు దుకాణాలు బంద్ ఉంచాలని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి దండోరా వేయించారు. గ్రామసభ తీర్మానం మేరకు గ్రామంలో ఏప్రిల్ 5 నుంచి బెల్టు దుకాణాలను పూర్తిగా బంద్ చేస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ తెలిపారు. ఇప్పటికే తీర్మానం ప్రతలను తహసీల్దార్, పోలీసుశాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇవ్వడం జరిగిందన్నారు.