సరళసాగర్ జలాశయానికి వరద.. నిలిచిపోయిన రాకపోకలు

WNP: సరళసాగర్ జలాశయానికి ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. నాలుగు ఆటోమెటిక్ సైఫాన్లు స్వయంగా తెరుచుకుని నీటిని విడుదల చేస్తున్నారు. మదనాపురం కాజ్వే బ్రిడ్జ్‌పై వరద ఉధృతి పెరగడంతో కొత్త కోట-ఆత్మకూర్, వనపర్తి మార్గాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితి స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.