VIDEO: హయత్ నగర్‌లో నిలిచిన వర్షపు నీరు

RR: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బంజారాకాలనీలో భారీగా వర్షపు నీరు నిలిచింది. గురువారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయం కాగా, హయత్ నగర్‌లోని బంజారా కాలనీకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.