'తడి, పొడి చెత్తను వేరు వేరుగా తరలించండి'
NTR: తడి, పొడి చెత్తలను విడివిడిగా చెత్తను సంపద కేంద్రాలకు తరలించాలని గంపలగూడెం ఎంపీడీవో టీ. సరస్వతి తెలిపారు. శుక్రవారం మేడూరు గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆమె స్వయంగా పరిశీలించారు. చెత్తను గృహాల వద్ద నుంచి సమకూర్చి, తీసుకుపోతున్నారా..? లేదా..? అన్న అంశంపై ఆరా తీశారు.