వినాయక చవితిపై అధికారులతో ఆర్డీవో సమీక్ష

వినాయక చవితిపై అధికారులతో ఆర్డీవో సమీక్ష

NTR: తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీవో మాధురి వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వాహకులు పోలీసులు, ఫైర్, విద్యుత్ శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలు వీలైనంత వరకు మట్టి విగ్రహాలను పూజించేలా అవగాహన కల్పించాలని ఆమె అధికారులను కోరారు.