మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ కార్మికుల ధర్నా
ATP: గుత్తి మున్సిపాలిటీ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ ..సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులకు వర్తింపజేయాలని వారి డిమాండ్ చేశారు.