INSPIRATION: మదర్ థెరిస్సా
ఆల్బేనియాలో జన్మించిన మదర్ థెరిస్సా, పేదలు, అనాథలకు సేవ చేయాలనే బలమైన కోరికతో భారతదేశంలోని కలకత్తాకు వచ్చారు. ఆమె 'మిషనరీస్ ఆఫ్ ఛారిటీ'ని స్థాపించారు. అందులో పేదరికం, రోగాలతో బాధపడుతున్న లక్షలాది మందికి ఆశ్రయం కల్పించి, సేవ చేశారు. ఆమె చేసిన నిస్వార్థ సేవకు 1979లో నోబెల్ శాంతి, 1980లో భారతరత్న బహుమతి లభించింది. ఆమె జీవితం ప్రేమ, కరుణ, మానవ సేవలకు గొప్ప ప్రేరణ.