కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
E.G: గండేపల్లి ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై కళ్యాణ మండప నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్యవైశ్య వనభోజనాల్లో పాల్గొని సహబంతి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గండేపల్లి ఆర్యవైశ్యులకు ఏ అవసరం వచ్చినా నేను ఉంటానని హామీ ఇచ్చారు.