రోడ్డుపై కంటైనర్ బోల్తా.. తప్పిన ప్రమాదం
విశాఖ: షీలానగర్ జంక్షన్లో పెను ప్రమాదం తప్పింది. బుధవారం తెల్లవారుజామున ఓ కంటైనర్ రోడ్డుమీద పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కంటైనర్ రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు 4 క్రేన్ల సహాయంతో కంటైనర్‌ను పక్కకు తీశారు.