న్యాల్కాల్ చెరువుకు నీటి విడుదల

న్యాల్కాల్ చెరువుకు నీటి విడుదల

NZB: జిల్లా మోపాల్ మండలం న్యాల్కాల్ గ్రామంలోని మాసాని చెరువుకు అలీ సాగర్ లిఫ్ట్ నుంచి నీటిని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శనివారం విడుదల చేశారు. ఈ నీరు సుమారు 15,000 ఎకరాల పంట పొలాలకు చేరుతుందని తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో, కలెక్టర్‌తో మాట్లాడిన తర్వాత ఈ నీటి విడుదల జరిగిందని, దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.