విజయవాడలో "మన్ కీ బాత్" వీక్షించిన కేంద్రమంత్రి

NTR: విజయవాడలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ప్రధాని మోదీ పాల్గొనే "మన్ కీ బాత్" కార్యక్రమాన్ని ఆదివారం వీక్షించారు. ఈ మేరకు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై మంత్రి సత్యకుమార్, ఇతర సహచర నేతలతో కలిసి కిషన్ రెడ్డి "మన్ కీ బాత్" వీక్షించారు.