షార్ట్ సర్క్యూట్‌.. ఇల్లు, స్పేర్ పార్ట్స్ దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌.. ఇల్లు, స్పేర్ పార్ట్స్ దగ్ధం

JN: పాలకుర్తి మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగి భారీ ఆస్తినష్టం సంభవించింది. మంగళవారం దుస్స శివ ఇంటిలో ఈ ఘటన జరిగింది. మంటల కారణంగా ఇంటి సామాన్లతో పాటు శివ నిర్వహిస్తున్న ఆటోమొబైల్ మెకానిక్ పనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.