క్రీడాకారులను అభినందించిన అదనపు కలెక్టర్

క్రీడాకారులను అభినందించిన అదనపు కలెక్టర్

MDK: పాఠశాల క్రీడా సమాఖ్య, తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్- 14 బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో మెదక్ జిల్లా జట్టు రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచింది. కాగా జిల్లా అదనపు కలెక్టర్ యం.నగేష్ క్రీడాకారులను అభినందించి, క్రీడాకారిణిలకు ఛాంపియన్ ట్రోఫీని అందించారు. పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు, వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు.