బై.. బై.. ముగిసిన 'ఇంటర్ ప్రథమ' పరీక్షలు

NLG: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. తల్లిదండ్రులతో సొంతూరిలో సరదాగా గడపడం కోసం ఎపుడెపుడా అని నిరీక్షించిన విద్యార్థులకు ఆ సమయం వచ్చేసింది. పరీక్షలు ముగిసిన వెంటనే సొంతూళ్లకు ఉరుకులు పరుగులు పెట్టారు. పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వస్తూనే కేరింతలతో సందడి చేశారు.