వివాహిత మృతిపై అనుమానం వ్యక్తం
విశాఖలోని రామకృష్ణాపురంలో శ్యామల (25) అనే వివాహిత సోమవారం మృతి చెందింది. మృతురాలి ముఖంపై గాయాలు ఉండటంతో, వరకట్న వేధింపుల కారణంగా ఆమెను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌ఎస్‌టీఎల్ ఉద్యోగి అయిన శ్యామలకు గత డిసెంబర్‌లో వివాహం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.