తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా రోహిత్ దంపతులు
TPT: సినీ హీరో నారా రోహిత్ ఈరోజు ఉదయం తన భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రేక్ దర్శనంలో భాగంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు నూతన దంపతులను శాలువాతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కాగా అక్టోబరు 30న నారా రోహిత్ వివాహం జరిగిన విషయం తెలిసిందే.