ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

NGKL: కల్వకుర్తి మండలంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అబూబకర్ ఫంక్షన్ హాల్ లో సబ్సిడీ సిలిండర్‌ల ప్రొసీడింగ్‌ల పంపిణి, అనంతరం సా. 6 గంటలకు సిలార్ పల్లి గ్రామంలో విద్యుత్ లైట్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.