రైలు ఢీకొని వృద్ధుడి మృతి

TPT: పుత్తూరు పట్టణం ధర్మరాజుల ఆలయం ఎదురుగా రైల్వే ట్రాక్ దాటుతున్న శీలకారు వీధికి చెందిన రాజు (68)ను గురువారం సాయంత్రం రైలు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆయన్‌ను స్థానికులు అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనపై పుత్తూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.