9వ రోజు కూంబింగ్.. 'మావో'లు ఎక్కడ?

MLG: కర్రెగుట్టలో పోలీసుల కూంబింగ్ 9వ రోజుకు చేరుకుంది. కర్రెగుట్టలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బలగాలు జల్లెడ పడుతున్నాయి. అయితే ఇప్పటివరకు మావోయిస్టులు కనిపించకపోవడం గమనార్హం. కాగా ప్రస్తుతం కర్రెగుట్టల పైనే పోలీసులు క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.