తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండటంతో భక్తులు వెలుపల క్యూలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,445 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ద్వారా రూ.3.79 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.