పాలీసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ CH జ్యోతి పాలీసెట్ దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈనెల 9వ తేదీ వరకు పొడిగించారని ఇవాళ తెలిపారు. గతంలో 4వ తేదీ వరకు గడువు ఇవ్వగా, విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.