సిమెంట్, స్టీలు ధరలకు రెక్కలు

సిమెంట్, స్టీలు ధరలకు రెక్కలు

NLG: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ముడిచమురు, రవాణా ఖర్చులు పెరిగి నల్లగొండ జిల్లాలో సిమెంట్, స్టీలు ధరలు ఆకాశాన్ని తాకాయి. సిమెంట్ బస్తా పై రూ. 80, టన్ను స్టీలు‌పై రూ.5,000 ధరలు పెరిగాయి. రెండు నెలల్లో రెండుసార్లు ధరలు పెరగడంతో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.