పేలుడు పదార్థాలు దొంగిలించిన ముగ్గురు అరెస్ట్

పేలుడు పదార్థాలు దొంగిలించిన ముగ్గురు అరెస్ట్

ATP: పెద్దవడుగూరులో రూ. 2 లక్షల విలువైన పేలుడు పదార్థాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. తనకు జీతం ఇవ్వని యజమానిపై కక్షతో, మాజీ డ్రైవర్ రవికుమార్ తన స్నేహితులతో కలిసి కార్తికేయ ఎంటర్‌ప్రైజెస్ మ్యాగజైన్ నుంచి డిటోనేటర్లు, పవర్‌జెల్ వంటి పేలుడు సామగ్రిని దొంగిలించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని ఏఎస్పీ రోహిత్ తెలిపారు.