VIDEO: మైలవరంలో సావిత్రిబాయి పూలేకి ఘన నివాళి
NTR: మైలవరం మండలంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయంలో మంగళవారం తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు నివాళులర్పించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా స్మరించారు. మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలను నాయకులు గుర్తుచేశారు.