బాండ్ పేపర్ రాసి సర్పంచ్ అభ్యర్థి హామీ
NZB: బోధన్ మండలం పెంటఖుర్దు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీగైని నాగేశ్ ప్రతి రూపాయిని గ్రామాభివృద్ధికే వినియోగిస్తానని హామీ ఇచ్చారు. వ్యక్తిగత అవసరాలకు రూపాయి కూడా వాడనని, అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక అకౌంట్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ మేరకు తన హామీలన్నింటిపై బాండ్ పేపర్ రాసి ప్రతులను ఓటర్లకు పంచుతున్నారు.