'రేగోడ్‌కు బస్సు పునరుద్ధరించండి'

'రేగోడ్‌కు బస్సు పునరుద్ధరించండి'

MDK: రేగోడ్ మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించాలని మండల వాసులు కోరుతున్నారు. గతంలో మెదక్ నుంచి పెద్దశంకరంపేట మీదుగా రాత్రి 9 గంటల సమయంలో రేగోడ్ వరకు పల్లె వెలుగు బస్సు సదుపాయం ఉండేది. ఈ బస్సు సౌకర్యం ద్వారా సిటీ నుంచి ఆలస్యంగా వారు పెద్దశంకరంపేటలో దిగి తిరిగి ఈ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకునేవారు. బస్సు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, పునరుద్దరించాలని కోరుతున్నారు.