మూడు రోజులపాటు కరెంట్ కట్

మూడు రోజులపాటు కరెంట్ కట్

చిత్తూరుతో పాటు పరిసర ప్రాంతాలలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ మునిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. జీడీ నెల్లూరు మండలంలో సబ్ స్టేషన్ ఫీడర్ పరిధిలో మూడు రోజులపాటు మరమ్మతులు చేపడుతుండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సరఫరా ఉండదన్నారు. ప్రజలు దీనిని గుర్తించాలని కోరారు.