'గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి'

'గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి'

KMM: సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని PYL జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ డిమాండ్ చేశారు. మంగళవారం రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో డ్రైనేజీ రోడ్డు అధ్వానంగా తయారవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అటు దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు.