నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
WGL: నల్లబెల్లి (M) లోని ముచ్చింపుల, రంగాపురం, దస్తగిరిపల్లె గ్రామాలలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. రంగాపురం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్లకు మరమ్మత్తులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్నందున ఉ 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ అధికారి వెంకట్ తెలిపారు. రైతులు గమనించాలని సహాకరించాలన్నారు.